ట్రేడ్ లైసెన్స్ పాత రుసుములతోనే చెల్లించండి

ట్రేడ్ లైసెన్స్ పాత రుసుములతోనే చెల్లించండి

కర్నూల్ కార్పొరేషన్, ఆంధ్రప్రభ : కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ట్రేడ్ లైసెన్స్ రుసుములను పాత ధరల ప్రకారమే చెల్లించే వెసులుబాటు కల్పించినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వ్యాపారస్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని నిర్ణీత గడువులోగా ట్రేడ్ లైసెన్స్ రుసుములు చెల్లించాలని సూచించారు.

ట్రేడ్ లైసెన్స్ రుసుముల తగ్గింపునకు సంబంధించి గత నెల 6వ తేదీన మంత్రి టీజీ భరత్ తగ్గించాలని నిర్ణయించి, తగ్గించే అంశంపై ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిపారు. అనంతరం పరిపాలన అనుమతులు, సాంకేతిక సమస్యలను పరిష్కరించి ప్రస్తుతం పాత ధరల ప్రకారమే వసూలు చేసేలా కల్పించిన వెసులుబాటును వ్యాపారస్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ నెల 31వ తేదీ వరకు గడువు ఉంటుందని, తదనంతరం అపరాధ రుసుముతో చెల్లించాల్సి ఉంటుందని కమిషనర్ పేర్కొన్నారు.

Leave a Reply