TPT | వైభ‌వంగా గోపూజ

TPT | వైభ‌వంగా గోపూజ

  • శ్రీ వేంకటేశ్వర గో సంరక్షణశాలలో గో మ‌హోత్స‌వ వేడుక‌లు

TPT | తిరుపతిరూరల్, ఆంధ్రప్రభ : తిరుపతి తుమ్మలగుంట సమీపంలోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో ఈ రోజు కనుమ పండుగ సందర్భంగా గో మహోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు జి.భాను ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ఇందులో భాగంగా గోశాలలోని శ్రీవేణుగోపాల స్వామి ఆలయంలో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గౌరిపూజ, తులసిపూజ చేశారు. అలాగే గజరాజు, అశ్వాలు, వృషభాలు, గోవులకు పూజలు చేసి కర్పూర హారతులు సమర్పించి, వాటికి దానా అందించారు. ఈ సందర్భంగా దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, కోలాటాలు నిర్వహించారు. గోశాల ఇంచార్జి సంచాలకులు డాక్టర్ శివ కుమార్, అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply