Total 500 | దర్శిలో మెగా జాబ్ మేళా

Total 500 | దర్శిలో మెగా జాబ్ మేళా
Total 500 | దర్శి ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, శ్రీ పొట్టి శ్రీరాములు డిగ్రీ కళాశాల, దర్శి వారి సంయుక్త ఆధ్వర్యంలో రేపు దర్శి పట్టణం లోని శ్రీ పొట్టి శ్రీరాములు డిగ్రీ కళాశాల నందు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల డైరెక్టర్ పొదిలి పెద్దిరాజు తెలిపారు. ఈ మేళాలో బహుళ జాతీయ కంపెనీలు పాల్గొంటున్నాయని ఇంటర్ నుండి డిగ్రీ, వరకు అర్హత ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోగలరని కోరారు.
ఈ జాబ్ మేళాలో 11 కంపెనీలు పాల్గొంటున్నాయని, మొత్తం 500 కి పైగా ఉద్యోగ ఖాళీలు అందుబాటులో ఉన్నాయని జీతాలు రూ.11,000 నుండి రూ.22,000 వరకు ఉండగా, కొన్ని కంపెనీలు ప్రోత్సాహకాలు, ఇతర భత్యాలు కూడా అందిస్తున్నాయని పెద్దిరాజు వివరించారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
