Tomato price | టమాట ధర పడిపోయింది.. కేజీ ఎంతో తెలుసా…?

Tomato price | టమాట ధర పడిపోయింది.. కేజీ ఎంతో తెలుసా…?

Tomato price | టేకుమట్ల, ఆంధ్రప్రభ : టమాటా ధర ఒక్కసారిగా పడిపోయింది. నిన్న మొన్నటి వరకూ యాభై నుంచి నలభై రూపాయలు కేజీ పలికిన టమాటా నేడు పదిరూపాయలకు పడిపోయింది. రెండు నెలల క్రితం టమాటా రూ. 150 లకు చేరుకుంది. టమాటా సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయింది. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవడం, ఇక్కడ సాగు ఎక్కువ విస్తీర్ణంలో కావడంతో ధర కొంచెం నలభై రూపాయలకు చేరుకుంది.

కిలో పది రూపాయలే….

భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెంకట్రావు పల్లి గ్రామంలో పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మీర్జంపేట గ్రామానికి చెందిన ఓ రైతు మాత్రం కిలో టమాటా పది రూపాయలకు ట్రాక్టర్ లోపోసి జనాలు ఎగబడ్డారు. ఎక్కువ దిగుబడి రావడంతో టమాటా ధర పూర్తిగా పడిపోయిందని, రానున్న రోజుల్లో మరింత ధర పడిపోయే అవకాశముందని రైతు చెబుతున్నారు.

Leave a Reply