Toluene Gang : డ్రగ్స్ గుట్టురట్టు

Toluene Gang : డ్రగ్స్ గుట్టురట్టు
Toluene Gang : గుట్టురట్టు
నందికొట్కూరులో.. టోలుయెన్ తయారీ
కీలక డ్రగ్స్ నెట్ వర్క్సమాచారం లభ్యం
నార్కొటిక్ బృందం అదుపులో ఇద్దరు
( ఆంధ్రప్రభ, నందికొట్కూరు)
ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా నందికొట్కూరు ఉలిక్కిపడింది. నందికొట్కూరులోని ఓ భవనంలో మాదక ద్రవ్యాల (Toluene Gang) తయారీ కేంద్రం గుట్టును హైదరాబాద్ నార్కోటిక్స్అధికారులు రట్టు చేశారు. ఒక్కసారిగా నందికొట్కూరు (Nandikotkur) ప్రజలు అవాక్కయ్యారు. ఓ కాలేజీలో ఎంబీయే దదువుతున్న విద్యార్థి మాదక ద్రవ్యాల తయారీ (Drugs Production Centre) సూత్రధారి కావటంతో.. నంద్యాల జనం ఔరా అని ఆశ్చర్యపోయారు. ప్రాథమిక సమాచారం మేరకు,

నంద్యాల పట్టణంలోని ఓ ప్రైవేటు కాలేజీకి ఎదుట ఒక భవనంలో ఒక సెలూన్ (Saloon ) నడుస్తోంది. ఆపై అంతస్తులో కర్నూలు కేవీకే సుబ్బారెడ్డి కాలేజీలో ఎంబీయే చదువుతున్న (MBA Student) మధు కుటుంబం ఉంది. మంగళవారం హైదరాబాద్ నుంచి నార్కొటిక్స్ (Norkotiocs Team) బృందం నందికొట్కూరుకు చేరుకుంది. మత్తు మందు టోలుయెన్ (Toluene) తయారీ కేంద్రంపై (Raided) దాడి చేశారు. భారీ స్థాయిలో మత్తు పదార్థానలను స్వాధీనం చేసుకున్నారు.

ప్రస్తుతం విద్యార్థి మధును, అతడి తండ్రి సురేష్ ను ( Father Suresh) అదుపులోకి తీసుకున్నారు. ఈ డ్రగ్స్ తయారీ–రవాణాలో అంతర్ రాష్ట్ర నెట్‌వర్క్ ఉందని అనుమానిస్తున్నారు. ఈ మేరకు కీలక ఆధారాలను నార్కోటిక్స్ బృందం సేకరిస్తోంది. ఈ డ్రగ్స్ ముఠాలో స్థానికులతో పాటు బయటి వ్యక్తుల పాత్రపై కూడా ఉందని అనుమానం వ్యక్తమవుతోంది.

నార్కోటిక్ బృందం కేసు నమోదు చేసింది. లోతుగా విచారణ జరుపుతోంది. డ్రగ్స్ సరఫరా నెట్ వర్క్ పై దృష్టి సారించింది. ఈ డ్రగ్స్ కేసు కీలక మలుపులు తిరిగే అవకాశం ఉందని జనం అనుమానిస్తున్నారు. టోలుయెన్ .. ఇది అసిటోన్ కంటే శక్తివంతమైంది. వేగంగా పనిచేస్తుంది. చాలా తక్కువ వ్యవధిలో పనిచేస్తుంది. 12,000 పీపీఎం టోలుయెన్‌ను 5 నిమిషాల పాటు పీల్చితే.. ఆ మత్తు శరవేగంగా మదిని కుదిపేస్తుంది.

ఈ విద్యార్థి మధుకు హైదరాబాద్ ముఠాతో సంబంధం ఉంది. ప్రతినెల ఐదుగురు ( Hyderabadis) హైదరాబాద్ నుంచి నందికొట్కూరు చేరుకుంటారు. వారం రోజులు టోలుయెన్ ను (Preparation ) తయారు చేస్తారు. అనంతరం ఇంజెక్షన్ల రూపంలో నెట్ వర్క్ (Drugs Net Work) కు అందజేస్తున్నారు, ఈ ముఠాకు ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక గ్యాంగులతో సంబంధం ఉందని నార్కోటిక్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కేసులో పూర్వపరాలు వెల్లడికి అధికారులు అంగీకరించటం లేదు.
