ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : టాలీవుడ్ ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ (Tollywood famous singer Rahul Sipliganj) ఇప్పుడు సింగిల్ లైఫ్ కు సెండాఫ్ ఇస్తూ ఒకింటి వాడయ్యాడు. ఎన్నో ఏళ్లుగా ప్రేమిస్తున్న తన ప్రియురాలు హరిణి రెడ్డి(Harini Reddy)తో ఏడడుగులు వేయబోతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 17 ఆదివారం నాడు హైదరాబాద్ (Hyderabad)లోని అతి కొద్ది మంది సన్నిహితులు, చిత్ర పరిశ్రమకు (film industry) చెందిన మిత్రులు, మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి ఎంగేజ్మెంట్ (Engagement)కి సంబంధించి అధికారిక ఫోటోలను విడుదల చేయలేదు. కానీ ఇండస్ట్రీకి చెందిన కొందరు ఈ ఫొటోలను సోషల్ మీడియా(Social Media)లో షేర్ చేసారు. రాహుల్ RRR సినిమాలోని నాటు నాటు పాటతో ఆస్కార్ అవార్డు (Oscar Award) అందుకుని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగు పాపులర్ షో బిగ్ బాస్ తోను తనకంటూ అభిమానులను సంపాదించుకున్నాడు రాహుల్.
గర్ల్‌ఫ్రెండ్ హరిణి రెడ్డితో నిశ్చితార్థం
