Toll Plaza | కేంద్రానికి కోమటిరెడ్డి లేఖ..

Toll Plaza | కేంద్రానికి కోమటిరెడ్డి లేఖ..
Toll Plaza | హైదరాబాద్, ఆంధ్రప్రభ: సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికుల ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. జనవరి 9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు టోల్ ప్లాజాల వద్ద టోల్ ఫ్రీ దిశగా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కిలోమీటర్ల కొద్దీ గంటల పాటు ట్రాఫిక్లో నరకయాతనకు గురికాకుండా ప్రయాణికులకు స్వాంతన చేకూర్చేలా మంత్రి కోమటిరెడ్డి (Minister Komatireddy) వెంకట్రెడ్డి మంగళవారం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి ఊళ్లకు వెళ్లి వచ్చే వాహనాలకు టోల్ వసూలు చేయొద్దని కోరుతూ ఆయన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు.
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లి, వచ్చే వాహనాలకు టోల్ వసూలు చేయొద్దని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. ఆ రోజుల్లో టోల్ ప్లాజాల దగ్గర ఫ్రీ వే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీ, తెలంగాణలో సంక్రాంతి అతిపెద్ద పండుగ అని, ఈ సందర్భంగా హైదరాబాద్ (Hyderabad) నుండి విజయవాడ మార్గంలో జనవరి 13 వరకు వాహనాల రాక విపరీతంగా ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు టోల్ గేట్ల దగ్గర ఉ న్న డేటా ప్రకారం.. సాధారణ రోజుల కంటే ఈ సమయంలో 200 శాతం అదనపు ట్రాఫిక్ ఉంటుందని వివరించారు. టోల్ ప్లాజాల దగ్గర ప్రయాణికులు తీవ్ర జాప్యానికి గురవుతున్నారని తెలిపారు. సంక్రాంతి నేపథ్యంలో నేషనల్ హైవేల పై ట్రా ఫిక్ రద్దీ నివారణకు చేపట్టాల్సిన చర్యల పై మంగళవారం సమీక్ష నిర్వహించారు.
