వికారాబాద్, ఏప్రిల్ 4 ( ఆంధ్రప్రభ) : వికారాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసినట్టు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో 7995061192 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఈ నెంబర్ ను సంప్రదించాలని ఆయన సూచించారు.
చౌడపూర్ మండలంలో ఐదు సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదు
వికారాబాద్, ఏప్రిల్ 4 (ఆంధ్రప్రభ ) : వికారాబాద్ జిల్లాలో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. జిల్లాలో అత్యధికంగా చౌడపూర్ మండలంలో ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిగతా అన్ని జిల్లాల్లో వర్షం కురిసినప్పటికీ చౌడాపూర్ మండలంలో మాత్రం పెద్ద ఎత్తున వర్షం నమోదైంది. ఈదురుగాలులు, వడగళ్ల వానతో రాత్రిపూట విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది.
