Together | పదోన్నతులు బాధ్యతలను పెంచుతాయి

Together | పదోన్నతులు బాధ్యతలను పెంచుతాయి

  • వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్

Together | వరంగల్ (క్రైమ్), ఆంధ్రప్రభ : పోలీసు అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని పోలీస్ అధికారులకు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. పోలీస్ కమిషనరేట్‌ పరిధిలో సివిల్ ఎస్సైలు(Civil Servants)గా పదోన్నతులు పొందిన సుదర్శన్ రెడ్డి, రవీంద్రచారి, యాదగిరి, కృష్ణమూర్తి, అజిదుద్దీన్, ఉప్పలయ్య, సారంగపాణి, రాజేశ్వరిలు పోలీస్ కమిషనర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలను అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. అప్పగించిన పనులను సమర్ధవంతంగా నిర్వర్తిస్తూ పోలీస్ వృత్తికి(Police career) వన్నెను తీసుకు రావాలన్నారు.పదోన్నతులు పొందడంతో మరింత బాధ్యతలు పెరుగుతాయని గుర్తు చేశారు. పోలీస్ ఆఫీసర్స్ గా సమర్ధవంతంగా పనిచేస్తూ ప్రజాభిమానాన్ని(Public opinion) చూరగొనాలని సూచించారు. డ్యూటీని ఛాలెంజ్ గా తీసుకొని పనిచేస్తూ సక్సెస్ ఫుల్ ఆఫీసర్స్ గా నిలువాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆకాంక్షించారు.

Leave a Reply