నేటి రాశిఫలాలు 5.03.25

మేషం : ఆర్థికాభివృద్ధి. ముఖ్య విషయాలు తెలుస్తాయి. ధన, వస్తులాభాలు. నూతన పరిచయాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి.

వృషభం : మిత్రులు, బంధువులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. వ్యవహారాలలో అవాంతరాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మిథునం : కొన్ని సమస్యలు తీరతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. స్థిరాస్తి వృద్ధి. ముఖ్య విషయాలలో చర్చలు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

కర్కాటకం : వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం. కుటుంబంలో వివాదాలు సర్దుకుంటాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

సింహం : పరిస్థితులు అనుకూలించవు. వ్యవహారాలలో ప్రతిబంధకాలు. అనారోగ్యం. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త సమస్యలు.

కన్య : వ్యయప్రయాసలు. బంధువులతో మాటపట్టింపులు. ఆలయ దర్శనాలు. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు.

తుల : కొత్త పనులు చేపడతారు. కొత్త వ్యక్తుల పరిచయం. ఆహ్వానాలు రాగలవు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అవాంతరాలు అధిగమిస్తారు.

వృశ్చికం : వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఒక సమాచారం ఊరటనిస్తుంది. పాతబాకీలు వసూలవుతాయి. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు లాభాలదిశగా సాగుతాయి. ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.

ధనుస్సు : రుణయత్నాలు. ఆలోచనలు కలసిరావు. ఎంత శ్రమ పడినా ఫలితం ఉండదు. పనుల్లో ప్రతిబంధకాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మకరం : కొన్ని వ్యవహారాలు వాయిదా పడతాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

కుంభం : యత్నకార్యసిద్ధి. నూతన వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి పిలుపు. భూలాభాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు.

మీనం : ఆస్తి వివాదాలు. సోదరులతో కలహాలు. స్వల్ప అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *