మేషం
ఇంట్లో శుభకార్యాల గురించి ప్రస్తావన వస్తుంది. జీవితభాగస్వామితో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి.
వృషభం
ఆర్ధిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. విందువినోదాలు, శుభకార్యాలలో పాల్గొంటారు. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులు నిదానంగా సకాలంలో పూర్తిచేస్తారు.
మిథునం
చేపట్టిన పనులలో జాప్యం జరిగినా అధిగమించి ముందుకు సాగుతారు. కుటుంబసభ్యుల సహాయసహకారాలు లభిస్తాయి. ఖర్చులు ఆదాయానికి మించి పెరుగుతాయి.
కర్కాటకం
నూతన మిత్రులతో పరిచయాలు ఏర్పడతాయి. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది. విలువైన వస్తువులు, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
సింహ
వివాదాలు, అనవసర విషయాలకు దూరంగా ఉండటం ఉత్తమం. దూరప్రాంతాలలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు.
కన్య
ఆర్థికపరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. చేపట్టిన కార్యక్రమాలు నిదానంగా సకాలంలో పూర్తిచేస్తారు. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి.
తుల
సంతానం చేపట్టిన నూతన కార్యక్రామాలకు మీ వంతు సహాయసహకారాలు అందజేస్తారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. ఉద్యోగ, వివాహయత్నాలు ఫలిస్తాయి.
వృశ్చికం
మీ ప్రతిభాపాటవాలకు సంఘంలో గుర్తింపు లభిస్తుంది. విందువినోదాలు, శుభకార్యాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. స్వల్ప ధనలాభాలు పొందుతారు.
ధనుస్సు
అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. నూతన వ్యాపారాలు ప్రారంభించి నిదానంగా అభివృద్ధిలోకి తీసుకువస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి.
మకరం
శ్రమ అధికంగా ఉన్నా సహనంతో పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ప్రయాణాలలో తొందరపాటు తగదు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
కుంభం
బంధువులతో ఏర్పడిన భూ వివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తిచేస్తారు. షేర్లు, భూముల క్రయవిక్రయాలలో ప్రోత్సాహం పొందుతారు.
మీనం
చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలను పంచుకుని ఆనందంగా గడుపుతారు. దూరప్రాంతాల నుంచి శుభ ఆహ్వానాలు అందుకుంటారు. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
