ముంబై : గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్. నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఇవాళ భారీ స్థాయిలో తగ్గింది. 24క్యారెట్ల 10గ్రాముల బంగారంపై రూ.2,130 తగ్గితే.. 22 క్యారెట్లపై రూ.1,950 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో గురువారం (మే 15) 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.86,100గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.93,930గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
ఇటీవలి రోజుల్లో లక్షకు చేరువైన పసిడి.. కాస్త తగ్గుముఖం పట్టడం సంతోషించాల్సిన విషయం. మరోవైపు వెండి ధర కూడా ఇవాళ తగ్గింది. వరుసగా రెండు రోజులు తగ్గిన వెండి నిన్న స్థిరంగా ఉండగా.. ఈరోజు మరలా తగ్గింది. నేడు బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.97,000గా నమోదయింది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ఒక లక్ష 8 వేలుగా ఉంది. ముంబై, ఢిల్లీ, బెంగళూరులో 97 వేలుగా కొనసాగుతోంది. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యత్యాసం ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం 10గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరలు ఇవి.