Tiryani | ప్రజాసేవకే జీవితం అంకితం

Tiryani | ప్రజాసేవకే జీవితం అంకితం

  • కాంగ్రెస్ పార్టీ గ్రామపంచాయతీ అభ్యర్థి నైతం రామచందర్

Tiryani | తిర్యాణి, ఆంధ్రప్రభ : పైసల మీద వ్యామోహం లేదు. ప్రజాసేవకే జీవితం అంకితం (రిటైర్డ్ టీచర్) అని కాంగ్రెస్ పార్టీ తిర్యాణి గ్రామపంచాయతీ అభ్యర్థి నైతం రామచందర్ అన్నారు. ఇవాళ‌ ఆయన స్వగృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ప్రజల కోరిక మేరకే తాను సర్పంచ్ బరిలో ఉన్నట్లు తెలిపారు. తిర్యాణి గ్రామ ప్రజలు కత్తెర గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే తనకు వచ్చే సర్పంచ్ జీతంతో పాటు తనకు వచ్చే పింఛన్ డబ్బులు కూడా ప్రజాసేవ కోసం ఖర్చు చేస్తానని పేర్కొన్నారు. గ్రామపంచాయతీలో వర్షాకాలం వస్తే మురికి కాలువ స‌మ‌స్య‌గా మారింద‌ని, అలాంటి వీధుల్లో డ్రైనేజీ వ్యవస్థను సక్కదిద్దుతామని పేర్కొన్నారు. యువతకు క్రీడా పరికరాలు, ఓపెన్ జిమ్ ఏర్పాటు కోసం నిధులు కేటా ఇస్తామని తెలిపారు. గ్రామపంచాయతీలో వృద్ధాప్య, వికలాంగుల‌, వితంతు పింఛన్ల మంజూరు కోసం ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని తెలిపారు.

గ్రామపంచాయతీకి వచ్చే నిధులు పూర్తిగా ప్రజాసేవకు అంకితం చేసి ఖర్చు చేస్తామని తెలిపారు. గ్రామంలోని ప్రతి ఇంటికి మినరల్ వాటర్ ను అందించే చర్య చేపడుతామని పేర్కొన్నారు. ఆపద సమయంలో ముందుండి గ్రామపంచాయతీ నిధులతో పాటు తన సొంత డబ్బులు ఖర్చు చేస్తానని పేర్కొన్నారు. తిర్యాణి గ్రామపంచాయతీ ప్రజలు తనను ఆదరించాల్సిందిగా కోరారు. అనంతరం గ్రామపంచాయతీలోని యువత పార్టీలో చేరితే వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంకం గౌరయ్య, మేరా చందు, బొల్లం రాకేష్, కూన సురేష్, బొల్లం మల్లేష్, మంద మల్లేష్, బొల్లం రాజేందర్, తట్ల ఎల్లయ్య, దాసరి వెంకన్న తట్లయువ నాయకులు అంకం రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply