వీధి వీధిలో జనంతో తిరుపతి కమిషనర్

వీధి వీధిలో జనంతో తిరుపతి కమిషనర్

తిరుపతి ప్రతినిధి, ఆంధ్రప్రభ : మొంథా తుఫాన్ ప్రభావంతో ఇబ్బంది ఎదుర్కొనే ప్రజల కోసం నగరంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను కార్పొరేషన్ కమిషనర్ మౌర్య(Corporation Commissioner Maurya) మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించారు. పునరావాస కేంద్రాల్లో ప్రజలకు అందిస్తున్న సౌకర్యాలను ఆయన అడిగి తెలుసుకున్నారు.

వర్ష ప్రభావిత ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి ఇబ్బంది ఎదురైనా వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. ప్రజలకు తాగునీరు, ఆహారం, విద్యుత్, వసతి వంటి ప్రాథమిక సౌకర్యాలు సమృద్ధిగా ఉండేలా చూడాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. అత్యవసర సమయంలో 0877 2256766, 90008 22909ను సంప్రదించాలని సూచించారు. డిప్యూటీ కమిషనర్ అమరయ్య(Amariah), రెవెన్యూ అధికారులు సేతు మాదవ్, రవి, ఆర్‌ఐలు పాల్గొన్నారు.

ఎస్టీవీ నగర్, కేశవాయనగుంట, గొల్లవాణిగుంట, కోరమేనుగుంట, హథిరాంజీ మఠం ప్రాంతాల్లో కమిషర్ పర్యటించారు. ప్రజలకు అందుతున్న తాగునీరు కలుషితం(rinking water contamination) కాకుండా చర్యలు తీసుకోవాలని, ప్రతిరోజూ నీటి సాంద్రత పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా కలుషిత నీరు గుర్తిస్తే సరఫరా నిలిపివేయాలని సూచించారు. వర్షాల వల్ల వ్యాధులు రాకుండా పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

Leave a Reply