Tirupati | హమ్మయ్య సీఎంని చూసేసాం…

Tirupati | హమ్మయ్య సీఎంని చూసేసాం…
- చిన్నమండెం నుండి వృద్ధ దంపతులు
Tirupati | తిరుపతి తుడా, ఆంధ్రప్రభ : నారావారిపల్లి లో అంగరంగ వైభవంగా జరుగుతున్న సంక్రాంతి సంబరాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును చూడటానికి వృద్ధ దంపతులు విచ్చేశారు. పండుగ వాతావరణంలో జరుగుతున్నసంక్రాంతి సంబరాలను తిలకించిన రాష్ట్ర ముఖ్యమంత్రిని చూడటానికి చిత్తూరు జిల్లా చిన్నమండ్యం నుండి వృద్ధ దంపతులు నారావారిపల్లి చేరుకున్నారు. కాలికి తగిలిన గాయాన్ని సైతం లెక్కచేయకుండా తమ అభిమాన నాయకుడిని చూడడానికి కుంటు కుంటూ ప్రజల మధ్యలోకి వెళ్ళి కలసి ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం కాలి గాయాన్ని చూసుకుంటూ సేద తీరుతూ కూర్చున్నారు.
