తిరుమలలో భక్తుల (devotees ) రద్దీ పెరిగింది. శుక్రవారం(friday) కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. నిన్నటి వరకూ సాధారణంగా ఉన్న భక్తుల రద్దీ నేడు రద్దీ పెరిగింది. కంపార్ట్ మెంట్లన్నీ (all compartments ) భక్తులతో నిండిపోయాయి (full ) . క్యూ లైన్లు (Q lines ) బయట వరకూ విస్తరించాయి. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD ) అధికారులు సామాన్య భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. క్యూ లైన్ లో ఉన్న భక్తులకు సత్వరం దర్వనం పూర్తయ్యేలా వేగంగా దర్శనాలు చేయిస్తున్నారు.
దర్శన సమయం…
శుక్రవారం నాడు మిగిలిన రోజులతో పోల్చుకుంటే దర్శన సమయం తక్కువగా ఉంటుంది. స్వామి వారికి ప్రత్యేక సేవలు ఉన్న కారణంగా దర్శనానికి కొంత విరామం ప్రకటిస్తూ ఉంటారు. మామూలుగానే శుక్రవారం, శనివారం, ఆదివారాలు తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందుకే వీకెండ్ లో మూడు రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. వసతి గృహాల నుంచి అన్న ప్రసాదం, లడ్డూ ప్రసాదం కౌంటర్ల వద్ద కూడా రద్దీ ఎక్కువగా ఉంటుంది.
అన్ని కంపార్ట్ మెంట్లు నిండి…
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట ఎస్.జి. షఎడ్స్ వరకూ క్యూ లైన్ విస్తరించి ఉంది. ఉదయం ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది.
నిన్న తిరుమల శ్రీవారిని 64,015 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 26,786 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.54 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.