Tirumala | టీటీడీ ప్రత్యేక ప్రణాళిక

Tirumala | టీటీడీ ప్రత్యేక ప్రణాళిక
- తిరుమలలో ఏఐ ఆధారిత ఫేస్ రికగ్నేషన్ కెమెరాలు
- శ్రీవారి ఆలయం ఎదుట ఏఐ ఎఫ్ఆర్సీ కెమెరాలు
- ఎప్పటికప్పుడు భద్రతసమాచారం అందుబాటులోకి
Tirumala | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : తిరుమలకు నిత్యం అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారు. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటుంటారు. అయితే తిరుమలలో భద్రతపై టీటీడీ ఫోకస్ పెట్టింది. భక్తుల భద్రత కోసం టీటీడీ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ఆలయం పరిసరాలలో అత్యాధునిక ఏఐ ఆధారిత ఫేస్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేసింది. తిరుమల శ్రీవారి ఆలయం దగ్గర ఈ కెమెరాలు భక్తుల రద్దీని అంచనా వేయడంతో పాటు, వాహన సేవల దర్శనాలపై ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తాయి.
ఎఫ్ఆర్సీ (ఏఐ ఆధారిత ఫేస్ రికగ్నేషన్ కెమెరా)లను ఏర్పాటు ద్వారా భక్తుల రద్దీ అంచనా వేయొచ్చు. అలాగే వాహన సేవల్ని ఎంతమంది భక్తులు దర్శించుకున్నారనే దానిపై కూడా పక్కాగా సమాచారం సేకరించవచ్చు. తిరుమల శ్రీవారి ఆలయం దగ్గర ఏర్పాటు చేసిన ఈ కెమెరాలను వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లోని ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు కనెక్ట్ చేశారు. దీంతో ఎప్పటికప్పుడు భద్రతకు సంబంధించిన సమాచారం కూడా అందుబాటులో ఉంటుంది.
