AP | డిసెంబర్ నాటికి టిడ్కో ఇళ్లు.. టిడ్కో చైర్మన్ అజయ్ కుమార్

ఇచ్ఛాపురం : డిసెంబర్ నాటికి టిడ్కో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని రాష్ట్ర టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ (Vemulapati Ajay Kumar) అన్నారు. ఆయన ఇచ్ఛాపురంలో టిడ్కో ఇళ్లను సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ (Bendalam Ashok) తో కలిసి అమీన్ సాహెబ్ పేట వద్ద గల టిడ్కో గృహ సముదాయాన్ని సందర్శించారు. రెండు పడక గదుల ఇళ్ల ను సందర్శించేందుకు దారి కూడా లేని పరిస్థితి ఉండడంతో వెనుదిరిగారు.

అనంతరం మున్సిపల్ సమావేశ మందిరంలో అధికారులు, విలేకరులతో మాట్లాడారు. డిసెంబర్ నాటికి 70వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి అందించే లక్ష్యంతో పని చేస్తున్నామని చెప్పుకొచ్చారు. లబ్ధిదారుల రుణాలకు సంబంధించిన నెలసరి బ్యాంకు వాయిదాలు రూ.185 కోట్లు ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టం చేశారు. కాలనీల్లో కేటాయించిన స్థలాల బదులు తమకు టిడ్కో ఇళ్లు మంజూరు చేయాలని పలువురు వినతిపత్రాలు సమర్పించారు. యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి రాజు, టిడ్కో ఎస్ ఇ, మున్సిపల్ కమీషనర్ రమేష్, టౌన్ ప్లానింగ్ అధికారి వినయ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply