గొలుసు గోవిందా..

మహిళ మెడలో చైన్ లాక్కెళ్లిన దుండ‌గులు

తిరుపతి రూరల్, ఆంధ్రప్రభ : తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట లోని నలంద నగర్‌లో నివాసం ఉంటున్న అనసూయ అనే మహిళ తన ఇంటి ఎదుట‌ బజారుకు వెళ్లడానికి నిలబడింది. గుర్తు తెలియని వ్యక్తులు టూవీలర్‌పై వచ్చి ఆ మహిళ మెడలోని 50 గ్రాములు గొలుసును లాక్కొని వెళ్లారు. దీని విలువ సుమారు రూ.6 లక్షలు ఉంటుందని బాధితురాలు తెలిపింది. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ చిన్న గోవింద్, ఎస్సై రామకృష్ణ విచారణ చేస్తున్నారు

Leave a Reply