తెలంగాణ నుంచి టీం లీడర్లుగా ముగ్గురికి అవకాశం

నిజామాబాద్, ఆంధ్రప్రభ : పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉక్రెయిన్ దేశానికి సంబంధించిన పార్లమెం టరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ టీం లీడర్ గా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి నియ మితులయ్యారు.ఈ ఫ్రెండ్షి ప్ గ్రూప్ ద్వారా భారత్ మరియు ఉక్రెయిన్ దేశాల మధ్య పార్లమెంటరీ స్థాయి లో ద్వైపాక్షిక సంబంధా లను మరింత బలోపేతం చేయడం, పరస్పర సహకా రాన్ని పెంపొందించడం, అలాగే విద్య, వాణిజ్యం, సాంస్కృతిక రంగాలలో సహకార అవకాశాలను విస్తరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అర్వింద్ టీం లీడర్ గా ఉన్న ఈ గ్రూపులో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయ మూర్తి రంజన్ గొగోయ్ – రాజ్యసభ (ఎన్ వోఎం)
లక్ష్మీకాంత్ పప్పు నిషాద్ – లోక్‌సభ (ఎస్ పి)
అమర్ శరద్రావ్ కాలే – లోక్‌సభ ( ఎన్ సి పి /ఎస్పీ)ఖలీలుర్ రహమాన్ – లోక్‌సభ ( ఏ ఐ టీ సి)
హనుమాన్ బేనివాల్ – లోక్‌సభ ( ర్ ఆ ర్ ఎల్ పి)
డా. ప్రభా మల్లికార్జున్ – లోక్‌సభ (ఐ ఎన్ సి)
శివమంగళ్ సింగ్ తోమర్ – లోక్‌సభ ( బిజెపి)
ఐ.ఎస్. ఇన్‌బదురై – రాజ్యసభ ( ఏఐ ఏ డి ఎం కే)రణదీప్ సింగ్ సుర్జేవా లా – రాజ్యసభ (ఐ ఎన్ సి)సదానంద్ మ్హాలు తనవాడే – రాజ్యసభ (బీజేపీ) సభ్యులుగా ఉన్నారు. ఈ ప్రతిష్టాత్మక బాధ్యతకు ఎంపిక కావ డం నిజామాబాద్ పార్ల మెంట్ నియోజకవర్గ ప్రజలకు గర్వకారణం. అర్వింద్ ధర్మపురి ఈ బాధ్యతను సమర్థవం తంగా నిర్వహిస్తూ దేశ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో మరింత పెంచు తారని ఆశాభావం వ్యక్త మవుతోంది. ఈ బాధ్య తలు అప్పగించినందుకు ప్రధాని మోదీకి, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కి, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు లకు ఎంపీ అర్వింద్ ధన్యవా దాలు తెలియజేశారు. కాగా తెలంగాణ నుంచి కువైట్ టీం లీడర్ గా కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఒమన్ టీం లీడర్ గా ఎంఐఎం అధినేత అస దుద్దీన్ ఓవైసీ టీం లీడర్లు గా ఎంపికయ్యారు.
