శ్రీ సత్యసాయి జిల్లా (Sri Sathya Sai district) లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమైన భక్తులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం (Tanakallu Mandalam) మండిపల్లి వద్ద ఈ రోజు ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు (Three spot died ). మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply