వెబ్ డెస్క్, హైదరాబాద్ : రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు (CustomsOfficials) భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. కువైట్ (Kuwait) నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికుల వద్ద అక్రమంగా తరలిస్తున్న 3.38 కిలోల బంగారంను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ సుమారు ₹3.36 కోట్లుగా అంచనా వేశారు.
ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులను అరెస్ట్ (Three passengers were arrested) చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు బంగారాన్ని విమానాశ్రయం ద్వారా స్మగ్లింగ్ (Smuggling) చేయడానికి ప్రయత్నించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది. ప్రస్తుతం కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు కస్టమ్స్ విభాగం తెలిపింది.