ఈరాత్రి నుంచే ఆ రెండు సినిమాలు స్ట్రీమింగ్ !!

ఈరాత్రి నుంచే ఆ రెండు సినిమాలు స్ట్రీమింగ్ !!

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : ఈ వీకెండ్ థియేటర్లలో (Theatres) ఇప్ప‌టికే రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ ‘OG’ సినిమాతో పాటు… ధనుష్ ‘ఇడ్లీ కడై’, రిషబ్ శెట్టి ‘కాంతారా చాప్టర్ 1’ వంటి సినిమాలు (movies) సందడి చేయ‌నుండ‌గా.. ఓటీటీ (OTT) ప్రేక్షకులకు (viewers) కూడా ఈ రాత్రి నుంచి రెండు కొత్త చిత్రాలు (films) అందుబాటులోకి రానున్నాయి.

శివకార్తికేయన్ నటించిన ‘మధరాసి’ & యువతను ఆకట్టుకునే ‘లిటిల్ హార్ట్స్’ ఈ రాత్రి నుంచి డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు (streaming) సిద్ధమవుతున్నాయి.

మురుగదాస్ – శివకార్తికేయన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ (Action thriller) ‘మధరాసి’, సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ (Box office) వద్ద అంచనాలకు తగ్గట్లు నిలవకపోయినా రూ. 100 కోట్ల గ్రాస్ (Gross) సాధించింది. ఈ చిత్రం ఈ రాత్రి నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో అన్ని భాషల్లో స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది. ఓటీటీలో ఈ సినిమాకు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

మరోవైపు, డెబ్యుటెంట్ (Debutante) సాయి మార్థాండ్ దర్శకత్వంలో, మౌళి తనుజ్ ప్రశాంత్ – శివాని నాగరాం జంటగా నటించిన ‘లిటిల్ హార్ట్స్’ కూడా ఈ రాత్రి నుండే అందుబాటులోకి వస్తోంది. ఈ చిత్రం ETV Win ప్లాట్‌ఫారమ్‌లో (platform) తెలుగులో స్ట్రీమింగ్ కానుంది.

విశేషమేమిటంటే, ఈ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ‘లిటిల్ హార్ట్స్’ సినిమా (movie) ‘ఎక్స్‌టెండెడ్ వెర్షన్’ (Extended Version)ను విడుదల చేయబోతోంది. మ‌రి ఈ రెండు చిత్రాలలో ఏ సినిమా ఓటీటీ ప్రేక్షకులను (OTT viewers) ఎక్కువగా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

Leave a Reply