అసలు కారణం ఇదే
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లా కేంద్రమైన నంద్యాల మార్కెట్ యార్డులో ఈ రోజు ట్రాక్టర్ డ్రైవర్(Tractor driver) నిర్లక్ష్యానికి ప్రాణం బలైపోయింది. ట్రాక్టర్ డ్రైవర్ అజాగ్రత్త వల్ల ట్రాక్టర్ వెనుక ఉన్న వృద్ధుడిని ఢీ కొట్టింది. సబ్సిడీ బియ్యంలో గ్రామీణ ప్రాంతాలకు తోలే ట్రాక్టర్ గా గుర్తించారు. మార్కెట్ యార్డ్ లో ఈ ప్రమాదం జరగటం అక్కడున్న అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు పేర్కొంటున్నా రు.
మార్కెట్ యార్డు(Market Yard)లో తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఈ వృద్ధుడి వయసు దాదాపు 64 సంవత్సరాలు. ఇతను వ్యవసాయం చేసుకుని వ్యక్తి. ఇక నువ్వుగోస్పాడు(Sugospadu) మండలంకు చెందిన వ్యక్తి సుబ్బరాయుడుగా గుర్తించారు. ఈ ప్రమాదం చూసి ప్రజలు చెల్లించి పోయారు. మార్కెట్ యార్డ్ లో మొక్కజొన్న పంట ఆరపేసుకున్న మరికొద్ది మంది రైతులు ఉన్నారు. ఒక నిండు ప్రాణం టైర్ల కింద నలిగిపోవడంతో అందర్నీ శోకసముద్రంలో ముంచేసింది. పోలీసులు(Police) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

