Corruption | ఇదేం ఘోరం నందీశ్వరా…!

  • భక్తుల సొమ్ముకే ఎస‌రా
  • ఇటీవల బయటపడ్డ బాగోతం

Corruption | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాకు (Nandyal District) 14 కిలోమీటర్లు దూరంలో పరమ పవిత్రమైన మహానందీస్వరస్వామి దేవస్థానంలో భక్తుల వేసిన విరాళాల సొమ్మును ఓ ఉద్యోగి కాజేస్తున్నట్లు భక్తులు ఆరోపిస్తున్నరు. గతంలో విరాళాల దోపిడీ సాగుతుందని పలు మార్లు పలువురు వెలుగులోకి తెచ్చినా పట్టించుకునే నాధుడే కరువయ్యారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహానంది దేవాలయంలో అడుగడుగునా దోపిడీ సాగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం విశేషం. కార్తీకమాసం, శివరాత్రి, దసరా పండుగ, ఇతర పండుగలు వస్తే దేవాలయంలో పనిచేసేవారు భక్తుల దగ్గర అందిందంతా దోపిడీ చేసుకుంటున్నారని గతంలో పలువురు భక్తులు ఆరోపించిన సంఘటనలు ఉన్నాయి.

కార్తీక మాసం సందర్భంగా ప్రతి ఏట గుత్తికి చెందిన ఒక భక్తుడు 20 లీటర్ల నూనెను విరాళంగా ఇచ్చేవారు. ఈ నూనెకు(oil) సంబంధించిన విరాళం దేవాలయంలోని ఓ వ్యక్తికి పంపిస్తుండడం ఆనవాయితీగా వస్తూ ఉండేది. విరాళం ఇచ్చిన వ్యక్తి దేవుని ఉపయోగపడుతుందని భావించేవాడు. ఆ ఉద్యోగి విరాళంగా వచ్చిన నూనెను సొంతానికి వాడుకుంటూ వస్తున్నారని దేవస్థానంలో పలువురు గుసగుసలాడుకోవడం విశేషం. ఇటీవల కాలంలో కార్తీక మాసంలో గత 15 ఏళ్లుగా చేస్తున్న సంఘటన ఒక్కసారిగా బయటకి రావటం భక్తుల ఆందోళన వ్యక్తం చేయటం విశేషం. దేవాలయంలో రోజు దోపిడీ జరుగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు.

దేవాలయంలో కొబ్బరి కాయ కొట్టినా 10 రూపాయలు ఇవ్వాల్సిందే. చెప్పులు, సెల్ ఫోన్ లకు అధికంగా డబ్బులు తీసుకుంటున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. స్పర్శ దర్శనాలు, నవగ్రహ దీపాలు, తాయతులు విక్రయించరాదని తెలిసినా నిత్యం అమ్మకాలు జరుగుతున్నాయని వేదనగా భక్తులు చెప్పుకోవడం విశేషం. గతంలో దేవాలయానికి వచ్చే విరాళాలు సైతం కొందరు వారి అకౌంట్లలో వేసుకుంటున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరో వైపు దేవాలయంలో సమర్పించే పట్టు చీరెలు సైతం మార్పులు చేస్తున్నారనే అపవాదు సైతం వినిపిస్తుంది.

స్వామివారికి కొందరు ఇచ్చే కానుకలు,బంగారు,వెండి వస్తువులు సైతం దోపిడి జరుగుతున్నట్టు పలువురు ఆరోపించటం విశేషం.ప్రసాదం విక్రయించే ప్రదేశాల్లో ఇప్పటికే ఎన్నో పర్యాయాలు అధికంగా డబ్బు దొరికిన విషయం తెలిసిందే.దేవాలయంలో సస్పెండ్ అయినవారు సైతం పనిచేస్తూ అంతా ఆయన హవా సాగుతున్నట్టు వినిపిస్తుంది.15 ఏళ్లుగా(15 Years )దోపిడీ జరుగుతున్నా పట్టించుకోకపోవడం విశేషం.ఇప్పటికైనా మహానంది లో భక్తులు ఇచ్చే విరాళాలపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది.కారకుడైన ఉద్యోగిని ని విధుల నుంచి తప్పించాలని, భవిష్యత్తులో అవినీతి అక్రమాలకు లేకుండా చేయాలని భక్తులు కోరుతున్నారు.

Leave a Reply