ఇదొక అంతరాష్ట్ర దొంగల ముఠా
- బ్యాంకు ఖాతాదారులే లక్ష్యం
- అలా బ్యాంకులో డబ్బు తీసుకుంటే…
- ఇలా మాయం చేస్తారు
- చాకచక్యంగా గోరంట్ల పోలీసులు పట్టివేత
- -రూ.7.5లక్షల నగదు ..- కారు స్వాధీనం
శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల, ఆంధ్రప్రభ : బ్యాంకుల్లో నగదు డ్రా చేసిన ఖాతాదారు(Account holder)లే లక్ష్యంగా చోరీలకు పాల్సడుతున్నఅంతరాష్ట్ర లేడీ చోరీ ముఠాను శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల పోలీసులు(Police) పట్టుకున్నారు. ఈ ముఠా నుంచి రూ.7.5లక్షల చోరీ నగదు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లో పథకం ప్రకారం బ్యాంకుల వద్ద కాపు కాచి..
బ్యాంకులో నగదు డ్రా చేసిన ఖాతాదారులను లక్ష్యంగా చేసుకుని నగదు చోరికి పాల్పడుతున్నఆరుగురు దొంగల ముఠాను గోరంట్ల పోలీసులు(police) అరెస్టు చేశారు. గోరంట్ల పోలీసు స్టేషన్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పెనుకొండ డిఎస్పీ యూ. నరశింగప్ప తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సెప్టెంబర్ 3న మద్యాహ్నం 2 గంటల ప్రాంతంలో గోరంట్ల మండలంలోని కొండాపురం గ్రామానికి చెందిన భుజంగరావు(Bhujangarao) దంపతులు స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ.3.80 లక్షల నగదు డ్రా చేశారు.
తన ద్విచక్ర వాహనం సైడ్ బ్యాగ్లో నగదు ఉంచారు. బ్యాంకు సమీపంలోని ట్రెండ్స్ షాపింగ్ మాల్ ఎదుటి పీ.ఎస్ కలెక్షన్ బట్టల దుకాణం ఎదుట తన ద్విచక్ర వాహనం(Two-wheeler) నిలిపి కొనుగోలు కోసం దంపతులు లోనికి వెళ్లారు. అప్పటికే వీరిని వెంబడిస్తున్నముఠాలోని ఇద్దరు మహిళలు ద్విచక్ర వాహనం వద్దకు చేరుకుని సైడ్ బ్యాగోలోని నగదు కవరు తీసుకుని తాము వచ్చిన కారులో పరారయ్యారు.
బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన గోరంట్ల సీఐ బీ. శేఖర్ బృందం(Gorantla CIB. Shekhar’s team) చాక చక్యంగా 44వ జాతీయ రహదారిలోని పాలసముద్రం క్రాస్ లోని కె. హోటల్ వద్ద అనుమానస్పద స్థితిలో ఉన్నఈ బృందాన్ని అదుపులోకి తీసుకున్నారు. వీరి దగ్గర రూ. 7.50లక్షల నగదు కనిపించింది. పోలీసుల ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు రావటంతో ఈ బృందాన్నిఅదుపులోకి తీసుకుని ప్రశ్నించగా… గోరంట్లలో ద్విచక్ర వాహనం బ్యాగులోని నగదు చోరి విషయం అంగీకరించారు.
వీరు వచ్చిన ఏం.పీ 09 జట్ఎక్స్1218 షిఫ్ట్ డిజైర్ కారును స్వాధీనం చేసుకున్నారు. మరింత లోతుగా విచారించగా.. ఈ బృందం 10 చోరీ కేసుల్లో నిందితులని తేలింది. మరొక ఎం.పీ 09 జడ్పి 2169 కారులో తిరుగుతూ(driving around in a car) బ్యాంకుల వద్ద నగదు డ్రా చేసుకుని వెళుతున్నవారు లక్ష్యంగా చోరీలకు పాల్పడినట్టు నిందితులు అంగీకరించారు. కడప జిల్లాలో మూడు, నంద్యాల జిల్లాలో ఒకటి, తెలంగాణలో మూడు, కర్ణాటకలో ఒకటి, ఒడిశాలో ఒక చోరీ చేశారు.
ఈ 10 దొంగతనాల్లో మొత్తం రూ.12,59,000ల నగదు దొంగిలించారు. వీరి నుంచి రూ.7.50 లక్షల నగదు, కారు స్వాధీనం చేసుకున్నారు. మధ్యప్రదేశ్ రాజ్(Madhya Pradesh Raj) ఘర్ జిల్లా పచోర్ తాలుక, కడియా సాన్సి గ్రామానికి చెందిన దీప్ మాల బాయి (43), ఫరిత సిపోడియా( 21), ప్రదీప్ సిపోడియా(38), మమత (27), ఇదే జిల్లా గుల్ ఖేడ్ గ్రామానికి చెందిన రేఖా బాయి (59), ఇదే జిల్లా హూల్ ఖేడి గ్రామానికి చెందిన మాల బాయి (40)ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.
ఈ సందర్భంగా డీఎస్పీ నరశింగప్పమాట్లాడుతూ.. తక్కువ రోజుల్లోనే అంతరాష్ట్ర ముఠా(an interstate gang) బృందాన్నిఅరెస్టు చేయడంలో కృషి చేసిన ఇన్స్ పెక్టర్ శేఖర్, ఎస్ఐ రామచంద్రయ్య, సిబ్బంది వెంకటేశ్, వేణుగోపాల్ రెడ్డిని అభినందించారు.

