Panchayathi election | ఇదో రకమైన హామీ!

Panchayathi election | బీజేపీ అభ్యర్థి గెలిస్తే… స్మశానవాటికకు ఐదు లక్షల విరాళం
Panchayathi election | మక్తల్ , ఆంధ్రప్రభ : మండలంలోని కాల్వల గ్రామం సర్పంచ్‌గా బీజేపీ (BJP) అభ్యర్థిని గెలిపిస్తే స్మశాన వాటికకు రూ ఐదు లక్షలు విరాళంగా ఇస్తానని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి ప్రకటించారు. ఈ రోజు కాల్వల గ్రామంలో బీజేపీ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. బీసీల స్మశాన వాటికకు స్థలం కావాలని కొందరు గ్రామస్థులు కోరగా వెంటనే స్పందించిన లక్ష్మికాంత్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ బలపరిచిన అభ్యర్థి గుండా రెడ్డిని గెలిపిస్తే తన వంతు సాయంగా బీసీల శ్మశానవాటిక స్థలానికి రూ.ఐదు లక్షల విరాళంగా ఇస్తానని ప్రకటించారు. ఈ సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షుడు అజిత్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ పసుల నీరజ్ , సర్పంచ్ అభ్యర్థి గుండా రెడ్డి, నాయకులు అంజిరెడ్డి , ఒడ్డె అంజప్ప, కిష్టప్ప, ముగ్ధుమ్ తదితరులు పాల్గొన్నారు.
