దొంగల స్వైర విహారం

అర్ధరాత్రి కలకలం

(అనంతపురం, ఆంధ్రప్రభ బ్యూరో) : అనంతపురం నగరంలో దోపిడీ దొంగలు స్వైర విహారం చేశారు. జనానికి కునుకు లేకుండా చేశారు. వరుస దొంగతనాలతో అనంతపురం ప్రజలు బేజారెత్తారు. తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నగర శివారులో కేశవరెడ్డి, నారాయణ. ఎస్ఎస్ఎస్ కళాశాలల పరిసర ప్రాంతాల్లో దొంగలు చెలరేగిపోయారు. భారీ స్థాయిలో కంప్యూటర్లు హార్డ్‌వేర్లు ఎత్తుకెళ్లారు. మూడు రోజుల క్రితం దక్షిణామూర్తి నగర్‌లో మూడు ఇళ్లల్లో లక్షలాది రూపాయాల సొత్తు కొల్లగొట్టేశారు. అటు దసరా పండుగ.. స్కూళ్లకు వరుస సెలవులు రావడంతో కుటుంబాలన్నీ ఊర్లకు వెళ్లిన సమయంలో పక్కా ప్లాన్‌తో దొంగతనాలు చేశారు. పోలీసుల రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు.

Leave a Reply