మృతులు వీరే..

  • మొత్తం 9 మంది శివైక్యం…
  • అందరూ ఆడోళ్లే.. ఒకరు పిల్లోడు ..

పలాస, ఆంధ్రప్రభ : కార్తీకశుద్ధ ఏకాదశి శనివారం రోజున కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట ఘటనలో 13 ఏళ్ల బాలుడు, 8 మంది మహిళలు మొత్తం తొమ్మిదిమంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో అత్యధికులు ఉద్దానం ప్రాంతానికి చెందినవారే…

టెక్కలి మండలం రామేశ్వరం గ్రామానికి చెందిన ఏడూరి చిన్నమ్మి (50), పిట్టలపాక గ్రామానికి చెందిన రాపాక విజయ (48), వజ్రపుకొత్తూరు మండలం దుక్కవాని పేట గ్రామానికి చెందిన మురిపింటి నీలమ్మ (60), మందస మండలానికి చెందిన బిల్లుపాటియా గ్రామానికి చెందిన దువ్వు రాజేశ్వరి (60), గుడిభద్ర గ్రామానికి చెందిన రూప (30), మందసకు చెందిన బోర బృందావతి (62), నందిగాం మండలం శివరామపురం గ్రామానికి చెందిన చిన్ని యశోద (56), సోంపేట మండలం బెంకిలి గ్రామానికి చెందిన లోట్ల నిఖిల్ (13), పలాస మున్సిపాలిటీకి చెందిన డొక్కర అమ్ముడమ్మ ఉన్నారు .తీవ్రంగా గాయపడిన నందిగాం మండలం రౌతుపురం గ్రామానికి చెందిన బాకీ కళావతి,మందస మండలం బెల్లుపాటియా గ్రామానికి చెందిన దువ్వు కుమారిని శ్రీకాకుళం రిమ్స్ కు తరలించారు.

Leave a Reply