Theft | భూపాలపల్లిలో దోపిడీ దొంగల హల్చల్..


జయశంకర్ భూపాలపల్లి – ఆంధ్రప్రభ ప్రతినిధి, – భూపాలపల్లి : జిల్లా కేంద్రంలో దోపిడీ దొంగల హల్చల్ చేశారు. తాళం వేసి ఉన్న ఇండ్లనే టార్గెట్ చేసిన దోపిడీలకు పాల్పడుతున్నారు. తాజాగా జిల్లా కలెక్టర్, ఎస్పీ నివాసాల వెనుక ఉన్న సింగరేణి ఎంసి క్వాటర్స్ లో రెండు ఇండ్ల తాళాలు పగలగొట్టి విలువైన ఆభరణాలు,వస్తువులు ఎత్తుకెళ్లిన ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇంటి యజమానులు ఒకరు కొత్తగూడెంలో ఉండగా మరో ఇంటి యజమాని హైదరాబాద్ లో వున్నారు. ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో భూపాలపల్లి సిఐ నరేష్ కుమార్ ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యజమానులు వచ్చాక ఎంత సొత్తు చోరికి గురైందో తెలియనుంది. కాగా వారం రోజుల వ్యవధిలో జిల్లా కేంద్రంలో వరుస దొంగతనలతో ప్రజలను బెంబేలెత్తిస్తున్నారు.

Leave a Reply