కమణీయం భ్రమరాంబిక మల్లికార్జునస్వామి కళ్యాణం

చెన్నూర్, ఆంధ్రప్రభ : మహాశివారాత్రి పండుగను పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కత్తారశాల గ్రామ మల్లికార్జున స్వామి ఆలయంలో మల్లికార్జునస్వామి భ్రమరాంబదేవి ల వేదబ్రహ్మణుల మంత్రో చ్చానలా సాక్షిగా కమణీయంగా జరిగింది. మంత్రి వివేక్ వెంకటస్వామి సతి సమేతంగా హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కత్తారశాల మల్లన్న ఆలయానికి ప్రత్యేక నిధులతో అభివృద్ధి చేయనున్నట్లు ఈ సందర్బంగా మంత్రి హామీ ఇచ్చారు.

