కాముడిని దహనం చేసిన గ్రామస్తులు..

కాముడిని దహనం చేసిన గ్రామస్తులు..

వేల్పూర్, ఆంధ్రప్రభ : బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని వేల్పూర్, మండలం అమీనాపూర్ గ్రామాలలో ఆదివారం రాత్రి కాముడిని దహనం చేశారు. వీధుల్లో తిరిగి కట్టెలు సేకరించి, ఒక చోట చేర్చి, పూజలు చేసి కాముడిని దహనం చేశారు. హోలీ పండుగ మార్చి 3న ఉన్నందున, ఈ గ్రామాలలో ఒక రోజు ముందే కాముడిని దహనం చేసి, హోలీ పండుగను జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచి గుండె సౌందర్య నవీన్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సర్పంచి గుండె సౌందర్య నవీన్ మాట్లాడుతూ.. కామ దహనం అనేది హోలీ పండుగకు ఒక రోజు ముందు జరిగే ముఖ్యమైన ఆచారం అని, ఇది మనిషిలోని చెడు గుణాలైన కామం, అహంకారం, అసూయ. క్రోధాన్ని దహించివేసి మనస్సును పవిత్రం చేస్తుందని తెలిపారు. గ్రామ ప్రజలు కూడా ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సౌందర్య నవీన్, ఉప సర్పంచ్ స్వామి గౌడ్ పాల్గొన్నారు.

Leave a Reply