అమరావతి విజయోత్సాహం..

అమరావతి విజయోత్సాహం..
- రాజధాని చట్టబద్ధతపై హర్షం
- ఇంద్రకీలాద్రికి భారీ పాదయాత్ర..
- తరలి వచ్చిన వందలాది మంది రైతులు, మహిళలు..
- అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు
ఇంద్రకిలాద్రి, ఆంధ్రప్రభ : అమరావతి రాజధాని చట్టభద్దాత కల్పించడం రాష్ట్రపతి గేజిట్ నోటిఫికేషన్ విడుదల అవుతున్న నేపథ్యంలో అమరావతి విజయోస్తవాలు ఊరురా జరుగుతున్నాయి. అమరావతికి చట్టభద్దత రావడంతో ఆ ప్రాంత రైతులు తమ ఇలవేల్పు కనకదుర్గమ్మకు మొక్కులు సోమవారం చెల్లించుకుంటున్నారు. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత లభించడంపై హర్షం వ్యక్తం చేస్తూ వందలాది మంది రైతులు భారీ పాదయాత్రగా ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. అమరావతి తుల్లూరు నుండి రైతులు పాదయాత్ర గా ఇంద్రకిలాద్రి చేరుకున్నారు. ఐదేళ్ల పాటు నిరంతర పోరాటం చేసిన అమరావతి రైతులకు తమ ఆకాంక్ష నెరవేరిన వేళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రాజధాని అంశంలో స్పష్టత రావడంతో మొక్కులు తీర్చుకునేందుకు రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో కాలినడకన బెజవాడకు తరలివచ్చి కనకదుర్గమ్మను దర్శించుకుంటున్నారు.
ఈ సందర్భంగా పాదయాత్రగా వచ్చిన రైతులకు దుర్గగుడి పాలకమండలి చైర్మన్ బోర్ర రాధాకృష్ణ స్వయంగా ఎదురెళ్లి స్వాగతం పలికారు. అమరావతి రైతుల త్యాగం వృథా కాలేదని, అమ్మవారి ఆశీస్సులతోనే ఈ విజయము సాధ్యమైందని రైతులు భావోద్వేగానికి లోనయ్యారు. న్యాయస్థానం నుంచి చట్టసభల వరకు అమరావతికి అనుకూలంగా నిర్ణయాలు రావడంపై రైతులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేసారు. అమ్మవారి కి ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి సారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
