మొక్కను నాటే కార్యక్రమం ఉద్యమంలా మారాలి

మొక్కను నాటే కార్యక్రమం ఉద్యమంలా మారాలి

  • నూతన ఆవిష్కరణలకు నాంది పలకాలి
  • రేపటి తరానికి మార్గదర్శకులుగా నిలవాలి
  • గౌరవ డాక్టరేట్ మన్నెకు ప్రధానం
  • పాలమూరు విశ్వవిద్యాలయం నాలుగవ స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరైన గవర్నర్

ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో, ఆంధ్రప్రభ : విశ్వవిద్యాలయాల నుంచి పట్టాలను అందుకోవడం కాదు.. విద్యార్థులు ఉద్యోగాల వేటలో పడడం కాదు.. కొత్త ఆవిష్కరణలు చేసి.. మరి కొంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ(State Governor Jishnu Dev Verma) అన్నారు. ఈ రోజు పాలమూరు విశ్వవిద్యాలయం నాలుగవ స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ మాట్లాడుతూ.. స్నాతకోత్సవం.. ఒక సమూహ ఆహ్వానమని, ఆనందకరమైన వేడుకని, ఈ వేడుక మనలో ఒక బాధ్యతను, పట్టుదలను గుర్తు చేస్తుందని చెప్పారు. విశ్వవిద్యాలయాల నుండి పట్టాలు పొందిన విద్యార్థులపై ఈ సమాజం ఎన్నో ఆశలు పెట్టుకుంటుందని చెప్పారు. ఆ ఆశలను వమ్ము చేయకుండా మీరు ఎంచుకున్న రంగాలలో రాణించి ధైర్యంగా, వినయంగా, అంకిత భావంతో బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టి మేదో వికాసం జరపాలి అన్నారు. విద్య ఉద్యోగాల కోసం కాకుండా ప్రతి ఒక్కరిలో ఉన్న ఊహలను మేల్కొల్పి పుచ్చుకతను రగిలించాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు.

రేపటి తరానికి మార్గదర్శకులుగా ఉంటూ జ్ఞానాన్ని అందించే దీపాలుగా వెలగాలని గవర్నర్ సూచించారు. పాలమూరు విశ్వవిద్యాలయం 15 సంవత్సరాలలో గణనీయమైన పురోగతిని సాధించడం గర్వించదగ్గ విషయం అన్నారు. విశ్వవిద్యాలయాలు దేశానికి వెలుగును ఇచ్చే దేవాలయాలు అని గవర్నర్ అభివందించారు. పీఎం ఉషా పథకం ద్వారా పాలమూరు విశ్వవిద్యాలయానికి రూ.100 కోట్ల నిధులు రావడం అభినందనీయమని చెప్పారు.

నాకు అక్రిడిటేషన్(Accreditation) రెండవ సైకిల్ పూర్తి కావడం ఇక్కడ పనిచేస్తున్న వైస్ ఛాన్స్లర్, అధ్యాపకులు, విద్యార్థుల నిబద్ధతకు దర్పణం పడుతుంది అన్నారు. అధ్యాపకులు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండడం ద్వారా మాత్రమే సమాజ వికాసం జరుగుతుంది అన్నారు. 21వ శతాబ్దపు విజ్ఞాన యుగంలో విశ్వవిద్యాలయాలు తమ లక్ష్యాలను పునర్ నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది అన్నారు. విద్యాలయాల ద్వారా ఒకే డిగ్రీలు విజ్ఞానానికి మాత్రమే పరిమితం కావొద్దు.. సమాజ‌ వికాసానికి తోడ్పడాలి అన్నారు. డ్రగ్స్(Drugs) నేటి సమాజంలో ప్రమాద భరితంగా మారుతున్నాయి. వాటి నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ప్రతి విద్యార్థి తమ తల్లి పేరుతో మొక్కను నాటే కార్యక్రమం ఉద్యమం లాగా మారాలన్నారు.

సాధారణ కుటుంబంలో జన్మించి.. నిరంతరం శ్రమ పట్టుదలతో ఎంఎస్ఎన్ కంపెనీ(MSN Company)ని స్థాపించి అనతి కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేసిన పాలమూరు(Palamuru) బిడ్డ ఎంఎస్ఎన్ కంపెనీ అధినేత మన్నే సత్యనారాయణ రెడ్డి(Manne Satyanarayana Reddy)కి మొట్టమొదటి గౌరవ డాక్టరేటును ప్రధానం చేశారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ఐ జి ఎల్ ఎస్ చౌహన్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి జితేందర్ రెడ్డి, పాలమూరు ఎమ్మెల్యే ఎన్నో శ్రీనివాసరెడ్డి(Enno Srinivasa Reddy), కలెక్టర్ విజయేంద్ర బోయి, ఎస్పీ జానకి, వైస్ ఛాన్స్లర్ జి ఎన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply