Kingdom | విజయ్ దేవరకొండ కొత్త సినిమా టైటిల్ ఖరారు..

  • అంచనాలు రెట్టింపు చేసిన టీజర్

యువ సంచలనం విజయ్ దేవరకొండ కథానాయకుడిగా.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘VD12’. కాగా, తాజాగా ఈ చిత్రానికి టైటిల్‌ని ఖరారు చేస్తూ టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాపై సినీ అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా టీజర్ కట్టిపడేసింది.

మ్యాన్ ఆఫ్ మాసెస్.. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో సాగిన ఈ టీజర్ అద్భుతంగా ఉంది. ఆకట్టుకునే యాక్షన్ సన్నివేశాలు, భావోద్వేగాలతో థియేటర్లలో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచే యాక్షన్ డ్రామాగా ‘కింగ్‌డమ్’ రూపొందుతోందని టీజర్‌తో స్పష్టం చేశారు మేక‌ర్స్. ఈ ఇంటెన్స్ టీజర్ తో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.

‘కింగ్‌డమ్’ టీజర్‌కి తెలుగు వెర్షన్‌కి జూనియర్ ఎన్టీఆర్ వాయ‌స్ ఓవ‌ర్ ఇవ్వ‌గా.. తమిళ వెర్షన్‌కి సూర్య, హిందీ వెర్షన్‌కి రణబీర్ కపూర్ వాయిస్‌ని అందించారు. ఈ ముగ్గురు తారలు తమ వాయిస్‌తో టీజర్‌ని మరో లెవల్‌కి తీసుకెళ్లారు. ఇక సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ తనదైన నేపథ్య సంగీతంతో మరోసారి కట్టిపడేశారు.

కాగా, ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకరా స్టూడియోస్ సమర్పిస్తోంది. ‘కింగ్‌డమ్’ మే 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *