ఆలయం మూసేసారు..

ఆలయం మూసేసారు..

వేములవాడ, ఆంధ్రప్రభ – దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం రాజన్న దర్శనాలను ఆలయ అర్చక బృందం, అధికార యంత్రాంగం నిలిపివేశారు. ఈ సందర్భంగా రాజన్న ఆలయ ప్రధాన ముఖద్వారం బుధవారం తెల్లవారుజామున మూసివేశారు. భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా భీమేశ్వరాలయంలో దర్శనాలతోపాటు మొక్కులు, కల్యాణాలు, ఆర్థిక సేవలను యధావిధిగా కొనసాగిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. రాజన్న ఆలయ గర్భగుడి దర్శనం ఎల్ ఈ డీ స్క్రీన్ ద్వారా భక్తులకు అందించనున్నట్లు రమాదేవి తెలిపారు. ఆలయ అభివృద్ధికి భక్తులు పుర ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Leave a Reply