Dust bins | పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎనలేనివి..

Dust bins | పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎనలేనివి..

  • జంపన ప్రతాప్

Dust bins | కంటోన్మెంట్, ఆంధ్ర‌ప్ర‌భ : పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటూ ప్రజల ఆరోగ్య(People’s health) సంరక్షణకు కృషి చేస్తున్న కంటోన్మెంట్ బోర్డు(Cantonment Board) పరిధిలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎనలేనివని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ అన్నారు. న్యూ బోయినపల్లి(New Boinappally)లోని ప్రధాన అంతర్గత రోడ్లపై డస్ట్ బిన్ లను తొలగించి చెత్త వేయకుండా చర్యలు చేపట్టడంతో పాటు బస్తిల్లో, కాలనీల్లో పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా కృషిచేస్తున్న దాఫెధార్ రామకృష్ణ, పారిశుద్ధ్య కార్మికులను జంపన ప్రతాప్ శాలువాతో సన్మానించారు.

అలాగే వారికి మాస్కులను, ఫ్రూట్స్, బిస్కెట్ లను పంపిణీ చేశారు. సమాజం నిద్ర లేవకముందే స్వచ్ఛ భారత్(Clean India) సంకల్పంతో పరిసరాలు శుభ్రంగా ఉండేలా చర్యలు(Actions) తీసుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు దుర్గయ్య, ప్రేమ్ ముదిరాజ్, సాయిబాబా యాదవ్, కరణ్ సింగ్, బండి శ్రీను, యాదగిరి, కృష్ణ సురేష్, సత్యనారాయణ, రవీంద్ర కిర‌ణ్‌, శివకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply