పవిత్ర గీతం వందేమాతరం..

పవిత్ర గీతం వందేమాతరం..
నారాయణపేట, (ఆంధ్రప్రభ )
భారతదేశ గౌరవం, ఐక్యత, త్యాగం, దేశం పట్ల మమకారం ప్రతిబింబించే పవిత్ర గీతం వందేమాతరం అని, 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అభినందనలు తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ సిక్తాపట్నాయక్ నేతృత్వంలో కలెక్టరేట్ అధికారులు, ఉద్యోగులు, పాఠశాల విద్యార్థులతో కలిసి సామూహికంగా వందేమాతరం గీతాన్ని ఆలపించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ సిక్తపట్నాయక్ మాట్లాడుతూ… “వందేమాతరం గీతం భారత జాతీయ చైతన్యానికి ప్రతీక. స్వాతంత్ర్య సమరయోధులలో దేశభక్తి జ్వాలలను రగిలించిన ఈ గీతం మనకు దేశం పట్ల ప్రేమ, గౌరవం, త్యాగం అనే విలువలను గుర్తు చేస్తుందన్నారు. ఈ గీతాన్ని 1875లో బంకిమ్ చంద్ర చటర్జీ రచించారు. 1950 జనవరి 24న రాజ్యాంగ సభ ఈ గీతాన్ని జాతీయ గీతంగా ఆమోదించడం చారిత్రక ఘట్టం అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఈ రోజు విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల సిబ్బంది అందరూ వందేమాతరం గీతాన్ని ఉదయం ఒకేసారి ఆలపించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఆమె జిల్లా ప్రజలను ఈ కార్యక్రమంలో భాగస్వాములై దేశ గౌరవానికి ప్రతీకైన జాతీయ గీతాన్ని ఆలపించి భారత తల్లికి వందనం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, శ్రీను, డిప్యూటీ కలెక్టర్ శ్రీరామ్ ప్రణీత్, ఆర్డీవో రామచందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
