ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం, ఉచిత సర్వదర్శనం కోసం 25 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. రూ.300 శీఘ్రదర్శనం భక్తులకు 3-4 గంటల సమయం పడుతోంది. ఇక, సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 4-6 గంటల్లో దర్శనం లభిస్తోంది.
నిన్న (బుధవారం) శ్రీవారిని 75,688 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,099 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం 4.45 కోట్లుగా నమోదైంది. భక్తుల రద్దీ నేపథ్యంలో, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.