- మొన్న కొర్రపాటి , నిన్న ఆనం , నేడు సుజనా చౌదరి సమర్పించిన శ్రీమాలిక !
విజయవాడ : తెలుగు నాట దసరా … శరన్నవరాత్రులంటే కనులముందు మొదటగా బెజవాడ కనకదుర్గమ్మే సాక్షాత్కరిస్తుంది. గత దశాబ్దకాలంగా దుర్గమ్మకు ప్రతీ ఏటా అపురూప పవిత్రతలతో శోభించే ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ రచనా సంకలనాన్ని అమ్మవారి మంత్ర గ్రంధంగా సుమారు ఐదు వేల ప్రతులు ప్రచురించి దేవస్థానం ఈ తొమ్మిదిరోజులూ నిర్వహించే కుంకుమార్చనల్లోను , విశేషపూజల్లో పంచేందుకై శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం కార్యనిర్వహణాధికారికి సినీ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు అందిస్తుంటారనేది పది సంవత్సరాలుగా పరమ పవిత్రంగా జరుగుతున్న ఒక సద్గ్రంథ తంతు.
ఈ మహాద్భుతమైన అదృష్టం పురాణపండ శ్రీనివాస్ కే దక్కడం ఆశ్చర్యంగా అనిపిస్తోందని, ఆయన పవిత్రమైన అందాల రచనా శైలి , నిస్వార్ధమైన వ్యక్తిత్వం , యజ్ఞభావనలే దుర్గమ్మ పాదాలకు పురాణపండ శ్రీనివాస్ ను దగ్గర చేశాయని శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం అర్చక పండితులు, అధికారులు ముక్త కంఠంతో చెప్పడం విశేషం.
గత కొన్ని సంవత్సరాలుగా నాటి ఉమ్మడి రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ ఐ.టీ . శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య , నేటి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖామంత్రి , నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖామంత్రి ఆనం రామ నారాయణరెడ్డి, మాహీ మంత్రి , కిమ్స్ హాస్పిటల్స్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య , హిందూపూర్ శాసన సభ్యులు నందమూరి బాలకృష్ణ , ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం అధినేత అయిన ఈగ సంచలన చిత్రం నిర్మాత సాయి కొర్రపాటి , ఎన్నెన్నో విజయోత్సవ చలన చిత్రాల సంస్థ వైజయంతీ మూవీస్ అధినేత చలసాని అశ్వనీదత్ … ఇలా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరు పురాణపండ శ్రీనివాస్ అపురూప మంత్రమయ గ్రంధాలకి సమర్పకులుగా వ్యవహరించడం ప్రత్యేకంగానే చెప్పాలి.
గత సంవత్సరం ఇండియా అడ్వకేట్ సొలిసిటర్ జనరల్ చల్లా ధనంజయ పురాణపండ శ్రీనివాస్ రచనగా మహిమోపేత గ్రంధాన్ని రెండు వేల ప్రతులు సమర్పించగా , ఈ సంవత్సరం విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు , సుజనా గ్రూప్ చైర్మన్ సుజనా చౌదరి సుమారు నాలుగు వందలపేజీల ‘ శ్రీమాలిక ‘ గ్రంధాన్ని వెయ్యి ప్రతులను శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం డిప్యూటీ కలెక్టర్ శీనా నాయక్ కు ఈ వారం లో అందజేయనున్నట్లు తెలుగు దేశం పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి.
గత సంవత్సరం దసరా ఉత్సవాలలో పురాణపండ శ్రీనివాస్ ‘ శ్రీలహరి ‘ ప్రత్యేక ఉపాసనా గ్రంధాన్ని విఖ్యాత ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావుచే ఆవిష్కరింపచేసిన నాటి కార్యనిర్వహణాధికారి కే.ఎస్.రామారావుపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ శ్రీలహరి గ్రంధాన్ని వేలకొలది భక్తులకు అందజేయడంలో దేవస్థాన సిబ్బంది, అర్చక వేదపండితులు చూపిన శ్రద్ధ అసమానమని భక్తులు సైతం అభినందనలు వెదజల్లడాన్ని నాటి పత్రికలూ పతాక శీర్షికల్లో ప్రచురించడం గమనార్హం.
ఈ పది సంవత్సరాల్లో సుమారు నాలుగు పర్యాయాలు లలిత అఖండ గ్రంధానికి సమర్పకులుగా సాయి కొర్రపాటి వ్యవహరించగా , ఒక పర్యాయం గత పర్యాటక శాఖామంత్రి , ప్రముఖ కథానాయిక శ్రీమతి ఆర్కే రోజా వ్యవహరించి కొన్ని పవిత్ర గ్రంధాలను ఆమె స్వయంగా పంచడం భక్తులను ఆకట్టుకుంది. ఇప్పటికీ తిరుమల, బెజవాడ, హైదరాబాద్ లలో అనేక ఆలయాల భక్తుల చేతుల్లో పురాణపండ , సాయి కొర్రపాటి సాయి గ్రంథాలెక్కువ దర్శనమిస్తాయని … ఇవి అద్భుతాలని భక్తులే స్వయంగా చెబుతున్నారు.
ఇప్పుడు సుజనా చౌదరి సమర్పణలో ఆలయానికి చేరుతున్న నాలుగు వందల పేజీల వైదిక వైభవ గ్రంధంలో స్తోత్ర వాగ్మయంతో పాటు, వొళ్ళు గగుర్పొడిచే రెండు మూడు దైవీయ ఘట్టాలను పురాణపండ శ్రీనివాస్ పరమాద్భుతంగా రచించారని … ఈ శ్రీమాలిక మహా అఖండ గ్రంధం ఇప్పటికే వేల వేల మందికి చేరి అమృతప్రాయమైన శోభల్ని వర్షిస్తోందని …. ఇరవై ఐదవ పునర్ముద్రణగా మళ్ళీ సుజనా చౌదరి సుకృతంగా దుర్గమ్మ అనుగ్రహానికి దసరా ఉత్సవాలలో భక్త కోటికి చేరుతోందని ఆలయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మహా జ్ఞానప్రసంగాల ఋషితుల్యులు చాగంటి కోటేశ్వర రావు, ఉపాసనా చైతన్య ప్రవచనకర్త సామవేదం షణ్ముఖశర్మ వంటి దిగ్గజాల ప్రశంసలు పొందిన పురాణపండ శ్రీనివాస్ అమోఘ ‘ శ్రీమాలిక ‘ మహా గ్రంధాన్ని సుజనా చౌదరి ఈ శరన్నవరాత్రుల ఉత్సవాల సందర్భంలో భక్తకోటి ప్రత్యేక పూజలకు కానుకగా బెజవాడ దుర్గమ్మకు సమర్పించడాన్ని ఇటు రాజకీయ వర్గాలు, అటు పండిత భక్త వర్గాలు అభినందిస్తున్నాను . ఈ శ్రీకార్యంలో సూత్రధారిగా వ్యవహరించిన హైదరాబాద్ కు చెందిన కానుమిల్లి ఇన్ ఫ్రా గ్రూప్ అధినేతలు కానుమిల్లి వెంకట ప్రసాద్ , శ్రీమతి నీరజ దంపతుల పవిత్ర హృదయాన్ని భక్త జనులు ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం దేవస్థాన వేద పాఠశాలల్లో సైతం సాయి కొర్రపాటి ప్రచురించిన పురాణపండ అమ్మణ్ణి , సహస్ర వంటి చక్కని గ్రంధాలనే పారాయణం చెయ్యడం దర్శనమిస్తోంది.
తన జీవన యాత్రలో ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నా, ఎక్కడా రాజీ పడకుండా , పవిత్ర స్వచ్ఛ హృదయంతో అమోఘ గ్రంథరాజాలను ఎన్నెన్నో దేవస్థానాలకు అందజేస్తున్న పురాణపండ శ్రీనివాస్ కి దైవబలం పుష్కలంగా ఉందని , తెలుగు రాష్ట్రాలలో ఏ రచయితకూ ఈ అదృష్టం దక్కలేదని అనేక ఆలయాల ధర్మకర్తలు, ప్రధాన అర్చకులు పేర్కొనడం ఈ సందర్భంగా ప్రస్తావించాల్సిందే !






