నిరసన దీక్షను విజయవంతం చేయాలి…
మోత్కూర్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 7న ఇందిరాపార్క్(Indira Park) వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహించే భారీ నిరసన దీక్షను విజయవంతం చేయాలని ఆ సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ యూనిట్ శాఖ అధ్యక్షుడు బద్ధం. యాదిరెడ్డి(Baddam. Yadi Reddy), ప్రధాన కార్యదర్శి ఆకవరం వల్లభాయిలు కోరారు.
విశ్రాంత ఉద్యోగుల సమస్యల సాధనకు ఈ నెల 7న హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించనున్ననిరసన దీక్షకి వాల్ పోస్టర్లను స్థానిక సంఘ కార్యాలయ భవనంలో ఆవిష్కరించారు. విశ్రాంత ఉద్యోగులకు నగదు రహిత వైద్య చికిత్స పథకాన్ని అమలు చేయాలని, ఇటీవల రిటైర్ అయిన ఉద్యోగులకు రిటైర్మెంట్ ప్రయోజనాల(Retirement Benefits)ని ఏక మొత్తంలో వెంటనే చెల్లించాలని, బకాయి ఉన్న డీఏలను వెంటనే చెల్లించాలని, పిఆర్సి ని అమలు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సంఘం కోశాధికారి వారాల యాదగిరి, ఉపాధ్యక్షులు తొగిటి మనోహరాచారి, ప్రచార కార్యదర్శి బి. వెంకటేశ్వర్లు, జిల్లా ప్రతినిధి సురోజు భాస్కరాచారి, అవిశెట్టి ఆవిలిమల్లు, అండెం సుధాకర్ రెడ్డి, ఏ. సత్తయ్య, కె. నర్సయ్య, సి. బిక్షం, ఎస్. యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

