శ్రామికుల అవతారమెత్తిన పోలీసులు…

  • రాత్రివేళ, తీవ్రమైన చలిలో ఉద్యోగం పట్ల బాధ్యత..
  • సమాజం పట్ల చిత్తశుద్ధిని చాటిచెప్పిన పోలీసులు..

ఏ.కొండూరు, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని ఏ.కొండూరు మండలం దీప్లానగర్ గ్రామ శివారులోని స్పిన్నింగ్ మిల్ సమీపంలో నేషనల్ హైవేపై మట్టి, రాళ్లు పడినట్లు మొబైల్ సేఫ్టీకి ఫోన్ కాల్ రావడంతో పోలీసు సిబ్బంది వెంటనే స్పందించారు.

ఈ మేరకు రోడ్ సేఫ్టీ మొబైల్–5 సిబ్బంది కె. జాషువా, సర్వేశ్వరరావులు తక్షణమే ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదాలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యగా రోడ్డుపై ఉన్న మట్టి, రాళ్లను పారల సహాయంతో స్వయంగా తొలగించారు.

ప్రమాదాల నివారణ కోసం రాత్రి తీవ్ర చలిలోనూ తమ బాధ్యతగా పనిచేసిన పోలీసుల సేవా నిబద్ధతను పలువురు ప్రజలు, వాహనదారులు అభినందించారు.

Leave a Reply