Karnataka | కుటుంబ యజమాని ఘాతుకం.. ముగ్గురిని చంపి.. ఆత్మహత్య
కర్ణాటకలోని మైసూరు విశ్వేశ్వరయ్య నగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో నలుగురు కుటుంబసభ్యులు విగతజీవులుగా మారారు. ఈ ఘటన ఇవాళ తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది. చేతన్(45) అనే వ్యక్తి భార్య రూపాలి(43), తల్లి ప్రియందవ(62), కుమారుడు కుషాల్(15)కు విషమిచ్చి.. ఆ తర్వాత తాను ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాలను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే విషయం తెలిసిన వెంటనే మైసూర్ పోలీస్ కమిషనర్ సీమా లట్కర్, డీసీపీ జాహ్నవి, విద్యారణ్యపురం ఇన్‌స్పెక్టర్ మోహిత్ సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు.