మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : దళిత నాయకుడు మరెల్లి అనిల్ (Marelli Anil) ను హత్యచేసిన హంతకులను తక్షణమే అరెస్టు (Arrest) చేయాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య (Bakki Venkataiah) పొలీసులను ఆదేశించారు. కుల్చారం (Kulcharam) మండలం పైతరకు చెందిన కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి మరెల్లి అనిల్ కుటుంబాన్ని గురువారం రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పరామర్శించి హత్య వివరాలను తెలుసుకున్నారు.
ఈసందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న దళిత నాయకుడు అనిల్ ను కాల్చి చంపడం తగదన్నారు. నిందితులు ఎంతటి వారైనా వదలొద్దని పొలీసులకు సూచించారు. అనిల్ హత్య కేసును ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసు (SC/ST Atrocity Case) గా మార్చాలని పొలీసులను అదేశించారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్, డీబీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి హన్మకొండ దయాసాగర్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు పుర్ర ప్రభాకర్, జాతీయ మాల మహనాడు జిల్లా అధ్యక్షుడు కల్లూరి సంజీవ్, నాయకులు పాల్గొన్నారు.