ప్రయాణికులతో పొన్నం ముచ్చట్లు..!
ఉమ్మడి మెదక్ బ్యూరో, ఆంధ్రప్రభ : పల్లె వెలుగు ప్రయాణికులతో రాష్ట్ర రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. వరద ముంపు బాధితులను పరామర్శించేందుకు హుస్నాబాద్ (Husnabad) వెళుతుండగా, మార్గమధ్యలో ఆర్టీసీ (పల్లె వెలుగు) బస్సు పంక్చర్ అయ్యింది. బస్సు ఆగిన విషయం తెలుసుకున్న మంత్రి పొన్నం తన కాన్వాయ్ ను కొద్ది సేపు ఆపి బస్సులోని ప్రయాణికులతో చిట్ చాట్ చేశారు. బస్సులో ప్రయాణికులతో ముచ్చటించారు. ఆర్టీసీ ఉన్నతాధికారులతో మాట్లాడిన పొన్నం వెంటనే బస్సు పంక్చర్ చేసి ప్రయాణికులను గమ్య స్థానాలకు పంపించాలని ఆదేశాలిచ్చారు.

