లోకేష్ కనగకార్ దర్శకత్వంలో తెరకెక్కిన కూలీ సినిమా ప్రస్తుతం థియేటర్లో దూసుకెల్తుంది. రజనీకాంత్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించగా, ఈ సినిమాలో లేడీ విలన్ గా కనిపించిన కళ్యాణి పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అయితే, ఈ కళ్యానీ ఎవరో కారు.. కన్నడ నటి రచితా రామ్.. తమిళ చిత్రసీమలో తొలిసారిగా “కూలీ”లోని కళ్యాణి పాత్ర ద్వారా లేడీ విలన్‌గా పరిచయం అయ్యింది.
2013లో దర్శన్‌తో కలిసి “బుల్బుల్” సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన రచితా రామ్, ఆ చిత్రం విజయంతో వరుస అవకాశాలు అందుకుంది. కన్నడలో ఉపేంద్ర, పునీత్ రాజ్‌కుమార్, దర్శన్ వంటి స్టార్ హీరోలతో పలు చిత్రాలలో నటించింది.
రచితా రామ్ తెలుగులోనూ నటించింది. 2022లో కళ్యాణ్ దేవ్ హీరోగా వచ్చిన “సూపర్ మచ్చి” సినిమాతో తెలుగు తెరకు రచితా పరిచయమైంది. అయితే ఆ చిత్రం విఫలమవడంతో, ఆమెకు టాలీవుడ్‌లో మరో అవకాశం రాలేదు.
కన్నడలో స్టార్ హీరోలతో పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి, ఇప్పుడు కోలీవుడ్‌లో లేడీ విలన్‌గా అడుగుపెట్టడం సినిమా వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.