Makthal | వైభవంగా స్వామివారి శోభయాత్ర

Makthal | వైభవంగా స్వామివారి శోభయాత్ర
ధ్వజారోహణంతో పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
Makthal | మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో వెలసిన శ్రీ పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం పట్టణంలోని అయోధ్య నగర్ (బ్రాహ్మణ వీధి)లోని ఉత్తరాది మఠం నుండి స్వామివారి ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ఊరేగింపుగా నిర్వహించిన శోభాయాత్ర శోభయామానంగా సాగింది. అయోధ్య నగర్ నుండి శివాజీ నగర్ (Shivaji Nagar) ఆజాద్ నగర్, మెయిన్ రోడ్డు గుండా శ్రీ పడమటి ఆంజనేయస్వామి దేవాలయం వరకు స్వామివారి శోభాయాత్ర బాజా భజంత్రీలు, భజనల మధ్య కొనసాగింది.
అనంతరం స్వామివారికి (Swami) విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వంశపారంపర్య ధర్మకర్త పి.ప్రాణేశాచారి ఆధ్వర్యంలో వేదమంత్రోత్సవాల మధ్య ధ్వజారోహణం గావించడంతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఈ సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కవిత, బ్రాహ్మణ పరిషత్ సభ్యులు మాన్వి రామారావు, శ్యాంసుందర్ జోషి, విద్యాసాగర్, యజ్ఞేష్ చారి, కరణం గోవిందరావు, హన్మేష చారి, అరవింద చారి, తదితరులు పాల్గొన్నారు.

