ఘనంగా విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం

బాన్సువాడ, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం పరిధిలోని బుడిమి గ్రామం మంజీరాతీరంలో హరిహర దేవతల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవము సదానంద పీఠాధిపరులు బసవ కళ్యాణ్, తెలంగాణ శ్రీ శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామి అనుగ్రహంతో 18 నుంచి 21 వరకు కార్యక్రమాలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. మొదటగా బుధవారం నాడు మహా రుద్రం, దేవతల మూర్తులను బుడిమిగ్రామం నుంచి మాంజిరా తీరం వరకు మంగళారతులతో ఊరేగింపు కొనసాగింది.

వేద పండితుల మంత్రోచ్ఛారణ తో నాలుగు రోజులపాటు గురువారం రోజున విగ్రహాలను జలదివాసంలో ఉంచుతారు. శుక్రవారం రోజున లక్ష పుష్పార్చన, దాన్య దివాసంలో ఉంచుతారు. శనివారం రోజున విగ్రహాలను వేదమంత్రాలు, యజ్ఞలు హోమాలు చేస్తూ విగ్రహ ప్రతిష్టాపన చేస్తారు. మధుసూదానంద స్వామి వారి ఆశీస్సులతో, శిష్యులు, భక్తులు ప్రతిరోజు అన్న ప్రసాదం కార్యక్రమం పెద్ద ఎత్తున భక్తులు నాలుగు రోజులపాటు కార్యక్రమాలు నిర్వహిస్తారని నిర్వాహకులు తెలిపారు.
