MLA | ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనాలి

MLA | ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనాలి

రైతులను ఆదుకోవాలి
మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు

MLA | కోడూరు, ఆంధ్రప్రభ : కోడూరు మండలంలో మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు (Simhadri Ramesh babu) పర్యటించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తుఫాన్ కారణంగా దివిసీమ రైతాంగం ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. వరి ధాన్యాన్ని కొనుగోలు చేయ‌డంలో జాప్యం జ‌ర‌గ‌డంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రహదారులు, పొలాల పక్కన ఉన్న దిబ్బల మీద రైతులు ధాన్యాన్ని రాశులుగా పోసి ఎవరు కొంటారా అని ఎదురుచూసే పరిస్థితి నెలకొందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Leave a Reply