కూనవరం, (ఏఎస్‌ఆర్‌ జిల్లా) : కొంద‌రు వైద్యులు త‌మ బాధ్య‌తలు నెర‌వేరుస్తారు. మ‌రికొంద‌రు డాక్ట‌ర్లు మాన‌వ‌త్వంతో త‌న ఔదార్యం చూపుతారు. రెండో కోవ‌లోనే చింతూరు (Chintoor) మన్యంలో మహిళా వైద్యురాలు తన ఔదార్యాన్ని చాటుకున్నారు. దీంతో ఓ చిన్నారి ఆరోగ్యం మెరుగుప‌డి క్షేమంగా ఉంది. వాన‌లు-వ‌ర‌ద‌లు నేప‌థ్యంలో చింతూరు ఐటీడీఏ పీఓ (ITDA PO) ఆదేశాల మేర‌కు మ‌న్యంలో వైద్యులు శిబిరాలు నిర్వ‌హిస్తున్నారు.

ఈ క్రమంలో టేకులొద్దిలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరం (Medical camp) ముగిసింది. దీంతో అప్ప‌టి వ‌ర‌కు వైద్య‌సేవ‌లు అందించిన కుటూరు వైద్యాధికారి విఘ్నా చేతులు దులుపుకోకుండా గ్రామం ద‌గ్గ‌ర ఉన్న కీడుపాక‌ల్లో ఇంటింటికి వెళ్లి ఆరోగ్య ప‌రిస్థితి ప‌రీక్షించారు. ఆ గ్రామానికి చెందిన కదల రాజారెడ్డి – గౌరీ దంపతుల కుమార్తె ఒక‌ నెల వ్యవధిలోపు పాప అనారోగ్యంతో బాధపడటాన్ని ఆమె గుర్తించారు. ప‌రిస్థితి గ‌మ‌నించిన వైద్యాధికారి విఘ్న ను తక్షణమే ప్రథ‌మ చికిత్స (First aid)లు అందించారు.

ఆ తల్లిదండ్రులకు చిన్నారి ఆరోగ్య పరిస్థితిని వివరించి త‌న వాహ‌నంలోనే చింతూరులోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చిన్న పిల్లల చికిత్స కేంద్రం (ఎస్‌ఎన్‌సీయూలో) చేర్చి దగ్గర ఉండి చికిత్సలు అందించారు. ఈ డాక్టర్‌తో పాటు కుటూరు పీహెచ్‌సీ ఏఎన్‌ఎమ్‌ హరణి కుమారి (PHC ANM Harani Kumari), ఆశా కార్యకర్త జయమ్మలు సైతం ఆమె వెంట ఉండి సహాయ సహకారాలు అందించారు. మన్యంలో ముగ్గురు మహిళలు కలసి ఓ చిన్నారి ప్రాణానికి ప్రమాదం లేకుండా చర్యలు తీసుకొని తమ మంచి మనసును చాటుకున్నారు. అలాగే ఆ చిన్నారి ఆరోగ్యం (Child health) కుదుట‌ప‌డింది. క్షేమంగా ఉంది.

Leave a Reply